24.3 C
Hyderabad
Monday, September 14, 2026

సూర్యాపేట జిల్లాలో దారుణం.. మహిళపై కాంగ్రెస్ నేత వేధింపుల ఆరోపణలు!

Must read

📰 Generate e-Paper Clip

మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఘటన

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో ఓ మహిళపై స్థానిక కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడి వ్యక్తిగత ఫోటోలు తీసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

నిందితుడి వేధింపులు, పోలీసుల నుంచి వచ్చినట్లు ఆరోపిస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. నిందితుడు అధికార పార్టీ నాయకుడు కావడంతో చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనకాడుతున్నారంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే బాధితురాలి ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పేర్కొన్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.