27.9 C
Hyderabad
Monday, September 14, 2026

ఆసియా కప్ విజేతగా భారత్‌

Must read

📰 Generate e-Paper Clip

 ఆసియా కప్ విజేతగా భారత్‌!_*

 

_మహిళల ఆసియా కప్ 2026 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 8వ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది._

 

_ఆదివారం దుబాయ్ వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 72 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ విధ్వంసానికి తోడుగా తెలుగు తేజం శ్రీచరణి(4/20) సత్తా చాటడంతో శ్రీలంక తేలిపోయింది._

 

_ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్మృతి మంధాన(39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59), షెఫాలీ వర్మ(39 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. శ్రీలంక బౌలర్లలో మిథాలి అయోధ్య, చమరి ఆటపట్టు, చముడి ప్రబోదా తలో వికెట్ తీసారు._

 

_అనంతరం శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 111 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ చమరి ఆటపట్టు(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36), నిలాక్షిక సిల్వా(16 బంతుల్లో ఫోర్‌తో 22) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలరల్లో తెలుగు తేజం శ్రీచరణి(4/20) నాలుగు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించగా..దీప్తి శర్మ(3/19) మూడు వికెట్లు పడగొట్టింది. క్రాంతి గాడ్, షెఫాలీ వర్మ, ప్రేమ రావత్‌కు తలో వికెట్ దక్కింది._

 

*_స్మృతి, షెఫాలీ ఊచకోత.._*

 

_టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. షెఫాలీ వర్మ, స్మృతి మంధాన పోటాపడి బౌండరీలు బాదడంతో భారత్ స్కోర్ బోర్డు పరుగెత్తింది. దాంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరూ శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. భారీ సిక్సర్లతో దూకుడు కనబర్చారు._

 

_షెఫాలీ వర్మ 24 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. స్మృతి మంధాన 35 బంతుల్లో అర్థ శతకం సాధించింది. 129 పరుగుల భారీ భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ప్రబోదా విడదీసింది. షెఫాలీ వర్మను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చింది. ఆ వెంటనే స్మృతి మంధాన రనౌట్ కావడంతో భారత పరుగుల వేగానికి బ్రేక్ పడింది._

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.