27.5 C
Hyderabad
Sunday, October 25, 2026

సంతోష్‌నగర్‌లో విషాదం.. మూడేళ్ల బాలుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

# సంతోష్‌నగర్‌లో విషాదం.. మూడేళ్ల బాలుడు మృతి

 

**వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఇజ్హాన్ ఉద్దీన్ మృతి**

 

**ప్రమాదం అనంతరం కారుతో పరారైన డ్రైవర్**

 

**కారు నంబర్ గుర్తింపు.. నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్న పోలీసులు**

 

### హైదరాబాద్, సెప్టెంబర్ 20 (దేశ టైమ్స్):

 

హైదరాబాద్ సంతోష్‌నగర్ ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల బాలుడు ఇజ్హాన్ ఉద్దీన్ మృతి చెందాడు. వేగంగా వచ్చిన కారు బాలుడిని ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనంతో సహా అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

 

తెలిసిన వివరాల ప్రకారం.. మొహియుద్దీన్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వీకార్ హోటల్ నుంచి పార్సెల్ తీసుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు ఆయన కుమారుడు ఇజ్హాన్ ఉద్దీన్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే షాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఓవైసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

 

సమాచారం అందుకున్న వెంటనే మజ్లిస్ అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ, ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీల ఆదేశాల మేరకు యాకుత్‌పురా మజ్లిస్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.

 

పోలీసుల ప్రకారం.. ప్రమాదానికి కారణమైన కారు నంబర్‌ను గుర్తించారు. కారు, డ్రైవర్ ఆచూకీని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది.

 

వాహనదారులు వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని పోలీసులు,

అధికారులు సూచించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.