ఈ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీనిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి హోంగార్డు ఆనంద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం రైల్వే పోలీసులు అతడిని పోలీసు శాఖకు తిరిగి పంపించారు. హోంగార్డుపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
హోంగార్డు తీరుపై డీజీపీ ఆగ్రహం
మహిళ పట్ల హోంగార్డు ప్రవర్తనపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా స్పందించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ సీపీని ఆదేశించారు. పోలీసు సిబ్బంది ఎవరైనా విధి నిర్వహణలో ఇలాంటి ప్రవర్తనకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ ప్రవర్తన పోలీసు శిక్షణ, ఆదేశాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
సైబరాబాద్ సీపీ రమేష్ మాట్లాడుతూ.. హోంగార్డుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని, రిమాండ్‌కు తరలించడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిపారు.

