23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

ప్రేమ పేరుతో వేధింపులు.. అక్కతో బాధ పంచుకున్న యువతి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

ప్రేమ పేరుతో వేధింపులు.. అక్కతో బాధ పంచుకున్న యువతి ఆత్మహత్య

 

హైదరాబాద్‌: ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 23 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉప్పల్‌ పరిధిలోని ఇందిరానగర్‌లో విషాదం నింపింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

 

వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లిలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్న గండమళ్ల చందన (23)ను, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారానికి చెందిన తుడుము శివ (23) గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు సమాచారం.

 

ఈ నెల 21న చందన తన అక్కతో తన బాధను పంచుకున్నట్లు తెలుస్తోంది. మరుసటి రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

 

మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చందన ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

 

DeshaTimes | హైదరాబాద్‌

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.