రేవంత్ రెడ్డిని రావణుడిగా చూపిస్తూ కటౌట్.. సీతారాంబాగ్‌లో ఉద్రిక్తత!
హైదరాబాద్: దసరా సందర్భంగా హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ రామ్ మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రావణాసురుడిగా చూపిస్తూ బీఆర్ఎస్ నేతలు కటౌట్ ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ నేత మెట్టు సాయికుమార్ తన అనుచరులతో అక్కడికి చేరుకుని కటౌట్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత నెలకొంది.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సీతారాంబాగ్‌లో రాజకీయ వర్గాల మధ్య చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

