24.3 C
Hyderabad
Monday, September 14, 2026

ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురికి తీవ్ర గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

  • మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టినట్లు అనుమానం
  • మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్ విజ్ఞాన్ కళాశాల సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్రా కారు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
  • గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థులు, నలుగురు పెయింటింగ్ కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
  • కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడిపినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం అనంతరం సుమారు రెండు కిలోమీటర్లు వెళ్లి కారును వదిలి పరారైనట్లు సమాచారం.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.