ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురికి తీవ్ర గాయాలు

మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టినట్లు అనుమానం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్ విజ్ఞాన్ కళాశాల సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్రా కారు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థులు, నలుగురు పెయింటింగ్ కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడిపినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం అనంతరం సుమారు రెండు...