32.1 C
Hyderabad
Tuesday, September 15, 2026

మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగలను పట్టించిన చీర* 

Must read

📰 Generate e-Paper Clip

*మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగలను పట్టించిన చీర* 

 

ఫంక్షన్‌కు దొంగిలించిన చీర కట్టుకుని వచ్చిన మహిళ, గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

 

2023లో జరిగిన దొంగతనం కేసు బట్టబయలు

 

హైదరాబాద్ – బండ్లగూడ జాగీర్ వినాయక నగర్ ప్రాంతంలో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి

 

2023 సెప్టెంబర్ 16వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, 19వ తేదీన తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉన్న రూ.2,50,000 నగదు, 9 తులాల బంగారం, పలు చీరలు దొంగిలించబడ్డాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన యాదయ్య

 

ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌కు, తమ ఇంటి వెనుక ఉండే స్వప్న(29) అనే మహిళ కట్టుకొచ్చిన చీర తనదేనని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన యాదయ్య భార్య

 

దీంతో స్వప్న, ఆమె భర్త రాములు(35)లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

 

మొదట ఆ చీర తనదేనని బుకాయించినా, అనంతరం యాదయ్య ఇంట్లో తామే దొంగతనం చేశామని ఒప్పుకున్న స్వప్న, రాములు దంపతులు

 

వారిపై దొంగతనం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.