*మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగలను పట్టించిన చీర*
ఫంక్షన్‌కు దొంగిలించిన చీర కట్టుకుని వచ్చిన మహిళ, గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
2023లో జరిగిన దొంగతనం కేసు బట్టబయలు
హైదరాబాద్ – బండ్లగూడ జాగీర్ వినాయక నగర్ ప్రాంతంలో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి
2023 సెప్టెంబర్ 16వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి, 19వ తేదీన తిరిగి వచ్చే సరికి ఇంట్లో ఉన్న రూ.2,50,000 నగదు, 9 తులాల బంగారం, పలు చీరలు దొంగిలించబడ్డాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన యాదయ్య
ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్‌కు, తమ ఇంటి వెనుక ఉండే స్వప్న(29) అనే మహిళ కట్టుకొచ్చిన చీర తనదేనని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చిన యాదయ్య భార్య
దీంతో స్వప్న, ఆమె భర్త రాములు(35)లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మొదట ఆ చీర తనదేనని బుకాయించినా, అనంతరం యాదయ్య ఇంట్లో తామే దొంగతనం చేశామని ఒప్పుకున్న స్వప్న, రాములు దంపతులు
వారిపై దొంగతనం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు