27.5 C
Hyderabad
Sunday, October 25, 2026

ప్రతి పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి 

Must read

📰 Generate e-Paper Clip

ప్రతి పేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి

 

 

వలిగొండ : సెప్టెంబర్ 17 (దేశ టైమ్స్) అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పాత్సకాలు అందే విదంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్, మండల ప్రత్యేక అధికారి జగన్నాద రావు అన్నారు.గురువారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భముగా స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వo ప్రజాపాలనలో చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం ప్రజలకు పేదలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ శాఖల అధికారులు సందేశాన్ని చదివి వినిపించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ భీమా నాయక్, పిఏసిఎస్ ఛైర్మెన్ గరిసే రవి, ఎంపిడిఓ జలంధర్ రెడ్డి, తహసిల్దార్ దశరథ, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.