27.5 C
Hyderabad
Sunday, October 25, 2026

శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే 

Must read

📰 Generate e-Paper Clip

శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే

 

వలిగొండ, సెప్టెంబర్ 17 (దేశ టైమ్స్): మండల కేంద్రంలోని శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎస్. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఫ్రెషర్స్ డే పార్టీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు.

ఫ్రెషర్స్ డే పార్టీలో విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తీన్మార్ డ్యాన్సులతో సందడి చేశారు. కళాశాల అధ్యాపకులు సైతం ప్రత్యేక నృత్య ప్రదర్శనలు చేసి విద్యార్థులను అలరించారు. విద్యార్థులు, అధ్యాపకుల నృత్య ప్రదర్శనలతో కళాశాల ప్రాంగణంలో ఉత్సాహ భరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు స్వాగతం పలికారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులు ఎలాంటి సంకోచం లేకుండా అధ్యాపకులతో మమేకమై తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తమ అనుభవాలను ప్రథమ సంవత్సరం విద్యార్థులతో పంచుకుంటూ వారికి మార్గదర్శకంగా నిలవాలని అన్నారు.

విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమైందని, ఈ రెండేళ్లను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదువుతూ ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరస్పరం స్నేహభావంతో మెలుగుతూ కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ

కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు పరశురాములు, హానీఫ్, వెంకటాచారి, మురళి, విజయ్‌ కుమార్, సురేష్, బిక్షం, స్వప్న, సైదా, రవి, కృష్ణ, గణేష్‌ కుమార్, గోపి, మృదుల, ఆనంద్ తదితరులతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.