23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

బాలుడు అక్షిత్ మృతిపై శ్రీ శ్రేష్ట హాస్పిటల్ వైద్యుల పరామర్శ బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. 

Must read

📰 Generate e-Paper Clip

బాలుడు అక్షిత్ మృతిపై శ్రీ శ్రేష్ట హాస్పిటల్ వైద్యుల పరామర్శ

 

బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.. 

దేశ టైమ్స్ మహబూబాబాద్

మరిపెడ: అక్టోబర్ 15

 

 

 మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఐదో వార్డుకు చెందిన ఎలక్ట్రీషియన్ హరీష్ కుమారుడు అక్షిత్ (9) ఇటీవల ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్న వయసులోనే బాలుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ విషాద ఘటన స్థానికంగా పలువురిని కలచివేసింది.

బాలుడి మృతి విషయం తెలుసుకున్న మరిపెడలోని శ్రీ శ్రేష్ట హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కారుణ్య సాగర్, డాక్టర్ బిందు శ్రీ, ప్రేమ్ సాగర్ గురువారం బాలుడి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్షిత్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాలుడి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిన్నారి మృతి ఆ కుటుంబానికి తీరని లోటని, ఇలాంటి విషాద సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని వైద్యులు సూచించారు. బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తూ, ఈ కష్టకాలంలో మనోధైర్యంతో ముందుకు సాగాలని ఓదార్చారు. బాలుడి అకాల మరణం స్థానికంగా విషాదాన్ని నింపింది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.