23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురు యువతులు మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

మంచిర్యాల: ఉదయం పనికి వెళ్తున్న ముగ్గురు యువతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నస్పూర్ గేటు వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మందమర్రి మండలం గుడిపల్లికి చెందిన సౌందర్య, రవళి, రమ్య ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నారు. రోజువారీగా ఆటోలో పనికి వెళ్తుండగా నస్పూర్ గేటు వద్ద ఓ బైక్ అడ్డురావడంతో దాన్ని తప్పించుకునే క్రమంలో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

లారీ బలంగా ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో సౌందర్య, రవళి, రమ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు యువతులు మృతి చెందడంతో గుడిపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.