లారీని ఢీకొన్న ఆటో.. ముగ్గురు యువతులు మృతి

  మంచిర్యాల: ఉదయం పనికి వెళ్తున్న ముగ్గురు యువతులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నస్పూర్ గేటు వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మందమర్రి మండలం గుడిపల్లికి చెందిన సౌందర్య, రవళి, రమ్య ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నారు. రోజువారీగా ఆటోలో పనికి వెళ్తుండగా నస్పూర్ గేటు వద్ద ఓ బైక్ అడ్డురావడంతో దాన్ని తప్పించుకునే క్రమంలో ఆటో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొనడంతో...