- మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టినట్లు అనుమానం
- మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండాపూర్ విజ్ఞాన్ కళాశాల సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహీంద్రా కారు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
- గాయపడిన వారిలో ఇద్దరు విద్యార్థులు, నలుగురు పెయింటింగ్ కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
- కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడిపినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదం అనంతరం సుమారు రెండు కిలోమీటర్లు వెళ్లి కారును వదిలి పరారైనట్లు సమాచారం.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

