26.5 C
Hyderabad
Monday, September 14, 2026

వేప చెట్టు విషయంలో గొడవ.. ఇద్దరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

మేళ్లచెరువు: మండలం ఎర్రగడ్డ తండాలో వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తగా, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు యాదవ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. సైదా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న మేళ్లచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ఎస్ఐ నవీన్‌పై గొడ్డలితో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి.

ప్రస్తుతం ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.