మేళ్లచెరువు: మండలం ఎర్రగడ్డ తండాలో వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తగా, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు యాదవ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. సైదా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న మేళ్లచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు ఎస్ఐ నవీన్‌పై గొడ్డలితో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి.
ప్రస్తుతం ఎర్రగడ్డ తండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.