వేప చెట్టు విషయంలో గొడవ.. ఇద్దరు మృతి

మేళ్లచెరువు: మండలం ఎర్రగడ్డ తండాలో వేప చెట్టు విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తగా, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో వెంకటేశ్వర్లు యాదవ్ ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. సైదా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న మేళ్లచెరువు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు...