కౌండిన్య గౌడ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కునూరు నిరంజన్ గౌడ్ నియామకం.
(యాదాద్రి కరస్పాండెంట్)
దేశ టైమ్స్,ఆగస్టు 19.
మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి శుభ సందర్భంగా కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణానికి చెందిన కూనూరు నిరంజన్ గౌడ్ ను నియమిస్తూ ఆ సంఘం జాతీయ అధ్యక్షులు న్యాయవాది కె ఎల్ ఎన్ ప్రసాద్ నియామక పత్రం హైదరాబాదులోని కౌండిన్య గౌడ సంఘం ఆఫీసులో అందజేశారు.
ఈ సందర్భంగా కేఎల్ఎన్ మాట్లాడుతూ సమాజంలో సేవా దృక్పథం ఉన్న వ్యక్తి నిరంజన్ గౌడ్ అని సంఘం పట్ల అంకితభావంతో పనిచేస్తారని వారికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లు తెలిపారు ఈ సందర్భముగా కూనూరు నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో తమకు పదవి బాధ్యతలు అప్పజెప్పిన సందర్భంగా జాతీయ అధ్యక్షులు కే ఎల్ ఎన్ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. కౌండిన్య గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అంకితభావంతో పనిచేసి కౌండిన్య గౌడ సంఘ బలోపేతానికి కృషి చేస్తూ పేద గీత కార్మికుల ఆదుకోవడంలో అన్ని రకాలుగా ముందుంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కందికంటి రాజా గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుండి నిరంజన్ గౌడ్ కు అభినందనలు తెలిపారు.

