హైదరాబాద్లో రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ అధికారిణి
హైదరాబాద్లోని సంతోష్నగర్లో టౌన్ ప్లానింగ్ అధికారిణి సీహెచ్ ప్రభావతిని రూ.20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. భవన నిర్మాణ అనుమతి ఇచ్చేందుకు ఆమె లంచం డిమాండ్ చేశారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో పక్కా ప్లాన్ ప్రకారం పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు..

