24.3 C
Hyderabad
Monday, September 14, 2026

పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి  

Must read

📰 Generate e-Paper Clip

పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి  

ఆగస్టు 25:(దేశ టైమ్)

వలిగొండ : పండుగలు శాంతియుతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రామన్నపేట సి సి రవి అన్నారు.మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మిలాద్ ఉన్ నభీ పండుగ సందర్భముగా నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సోదరభావం, పరస్పర గౌరవంతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మతపెద్దలకు, ప్రజలకు సూచించారు.పండుగ సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, హిందూ,ముస్లిం మతపెద్దలు, శాంతి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.