26.5 C
Hyderabad
Monday, September 14, 2026

పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.

Must read

📰 Generate e-Paper Clip

పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

 సీఐ ఎం రవి.

 (యాదాద్రి కరస్పాండెంట్ )

 దేశ టైమ్స్,ఆగస్ట్ 25.

 

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా మండలంలోని హిందూ, ముస్లిం మతపెద్దలు, ప్రజాప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులతో పీస్ కమిటీ సమావేశం ఎస్సై ఏ. శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. 

 ఈ సమావేశానికి రామన్నపేట సిఐ ఎం రవి హాజరై మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సోదరభావం, పరస్పర గౌరవం, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడకుండా, పోలీస్ శాఖకు సహకరించాలని,ప్రజలందరూ మతసామరస్యాన్ని పాటిస్తూ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు,ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.