*ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి*
యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దుశ్చర్య
ఆత్మకూరు మండలంలోని ఓ గ్రామంలో నివసిస్తున్న మానసిక దివ్యాంగురాలి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన గ్రామశాఖ అధ్యక్షుడు శంకర్ రెడ్డి
జరిగిన విషయాన్ని బాధితురాలు తన భర్తకు తెలపడంతో పెద్దమనుషుల ముందు పంచాయతీ పెట్టిన బాధితురాలి భర్త
దీంతో బాధితులపై బెదిరింపులకు దిగుతూ వారిని అవమానించసాగిన శంకర్ రెడ్డి
తన భార్యపై లైంగిక దాడికి పాల్పడిన శంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని భర్త చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

