26.5 C
Hyderabad
Monday, September 14, 2026

ఉత్తర కెన్యాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఏడుగురి మృతి..!!*

Must read

📰 Generate e-Paper Clip

*ఉత్తర కెన్యాలో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఏడుగురి మృతి..!!*

 

నైరోబీ: ఉత్తర కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబురు కౌంటీలోని మారుమూల ప్రాంతంలో సఫారీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఈక్వెడార్‌ జాతీయ నిఘా విభాగం అధిపతి మిచెల్‌ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ సెన్సి కూడా ఉన్నారు.

 

కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ వివరాల ప్రకారం.. లోయిసాబా కన్జర్వెన్సీ నుంచి ఎవాసో న్గిరో ప్రాంతం వైపు హెలికాప్టర్‌ వెళ్తోంది. హెలికాప్టర్‌లో మొత్తం ఏడుగురు ఉండగా వారిలో ఆరుగురు ప్రయాణికులు, మరొకరు పైలట్‌. అయితే, బుధవారం ఉదయం 9:13 గంటల సమయంలో సంబూరు కౌంటీలోని మౌంట్ ఒలోలోక్వే వద్దకు హెలికాప్టర్‌ రాగానే ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మారుమూల ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు, ఘటనాస్థలిలో మంటలు చెలరేగడంతో సహాయక చర్యలు మరింత క్లిష్టంగా మారినట్లు కెన్యా రెడ్‌క్రాస్‌ తెలిపింది.

 

ఈ ప్రమాదంలో ఐదుగురు అమెరికా పౌరులు మృతిచెందినట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. మృతుల్లో టెలిముండో సంస్థకు చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ జోస్‌ అల్బెర్టో సువారెజ్‌, ఈక్వెడార్‌ జాతీయ నిఘా కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ మిచెల్‌ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ సెన్సి ఉన్నారు. హెలికాప్టర్‌ను లేడీ లోరీ హెలికాప్టర్స్‌ సంస్థ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై కెన్యా విమానయాన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, హెలికాప్టర్‌ ప్రయాణ వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.