క్రాకటోవా విస్ఫోటం.. 301 విమాన సర్వీసులకు బ్రేక్!
ఇండోనేషియాలోని అనక్ క్రాకటోవా అగ్నిపర్వతం బద్దలై భారీగా బూడిదను వెదజల్లింది.
ఈ బూడిద మేఘాలు ఏకంగా 20 వేల నుంచి 50 వేల అడుగుల ఎత్తు వరకు ఎగసిపడ్డాయి.
దీంతో జకార్తాతో పాటు 6 ఎయిర్‌పోర్టులను మూసివేయగా, 58 అంతర్జాతీయ సర్వీసులతో సహా మొత్తం 301 విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
గతంలో 2018లో ఇదే అగ్నిపర్వత విస్ఫోటం తర్వాత వచ్చిన సునామీ 430 మంది ప్రాణాలను బలిగొంది.

