23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

తెలంగాణలో 2 ఎమ్మెల్సీ సీట్లపై కాంగ్రెస్ కసరత్తు రెండు స్థానాలకు ఆరుగురి పేర్లతో పీసీసీ జాబితా.. సెప్టెంబర్ 29న తుది నిర్ణయం

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. నల్గొండ–వరంగల్–ఖమ్మం, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురేసి పేర్లతో పీసీసీ జాబితాను సిద్ధం చేసి పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు తాజా సమాచారం.

నల్గొండ–వరంగల్–ఖమ్మం స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ స్థానానికి మన్నె జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీశ్ పేర్లను పీసీసీ సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

నల్గొండ–వరంగల్–ఖమ్మం అభ్యర్థి ఎంపిక బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ అభ్యర్థి ఎంపిక బాధ్యతను మంత్రి దామోదర్ రాజనర్సింహకు అప్పగించినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు, స్థానిక రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

పీసీసీ పంపిన జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ 29న ఢిల్లీలో రెండు స్థానాలకు తుది అభ్యర్థులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.