తెలంగాణలో 2 ఎమ్మెల్సీ సీట్లపై కాంగ్రెస్ కసరత్తు రెండు స్థానాలకు ఆరుగురి పేర్లతో పీసీసీ జాబితా.. సెప్టెంబర్ 29న తుది నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. నల్గొండ–వరంగల్–ఖమ్మం, హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురేసి పేర్లతో పీసీసీ జాబితాను సిద్ధం చేసి పార్టీ అధిష్ఠానానికి పంపినట్లు తాజా సమాచారం. నల్గొండ–వరంగల్–ఖమ్మం స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ స్థానానికి మన్నె జీవన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, గౌరీ సతీశ్ పేర్లను పీసీసీ సిఫారసు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి....