23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

24 గంటల్లో రైతుల విద్యుత్ సమస్యకు పరిష్కారం

Must read

📰 Generate e-Paper Clip

24 గంటల్లో రైతుల విద్యుత్ సమస్యకు పరిష్కార

 

దేశ టైమ్స్ మహబూబాబాద్

సెప్టెంబర్ 20:

 

మహబూబాబాద్ జిల్లా

కురవి మండలం కందికొండ గ్రామంలో గత మూడేళ్లుగా నిరుపయోగంగా ఉన్న విద్యుత్ కరెంటు ట్రాన్స్ఫారం (డి..వి) సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్ సౌకర్యం సక్రమంగా అందకపోవడంతో సాగునీటి విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రైతులు తమ సమస్యను గ్రామ సర్పంచ్ తోడుసు నాగార్జున దృష్టికి తీసుకెళ్లారు.

రైతుల సమస్యను సర్పంచ్ నాగార్జున డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత విద్యుత్ అధికారులతో మాట్లాడి సమస్యను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు స్పందించి 24 గంటల్లోనే విద్యుత్ డీవీని పునరుద్ధరించి రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన సర్పంచ్ తోడుసు నాగార్జునకు, సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్‌కు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు బయ్య శ్రీనివాస్, తోట మహేష్

సిరోల్ ఏ.ఈ .లైన్మెన్ వీరన్న, ఎస్కే జాగిర్,

తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.