మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదానం
సేవా కార్యక్రమాల్లో భాగంగా భక్తులు, ప్రజలకు అన్నప్రసాద వితర
దేశ టైమ్స్
మహబూబాబాద్/
మరిపెడ, సెప్టెంబర్ 20:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో మరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం రోజున భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగామరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి భక్తులు, ప్రజలకు భోజనాన్ని వడ్డించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం నుంచే అన్నదాన కార్యక్రమం వద్ద సందడి నెలకొంది. సంఘం సభ్యులు స్వయంగా సేవలందిస్తూ భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా మరిపెడ పద్మశాలి సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ అన్నదానం మహోన్నతమైన సేవా కార్యక్రమమని, సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంతో పాటు ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి తమ వంతు సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడామరిపెడ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా, సామాజిక కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్థానికులు మాట్లాడుతూ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం అభినందనీయమని అన్నారు. సమాజ సేవలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించడం ద్వారా ప్రజల్లో సేవా స్ఫూర్తి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ సునీత రవీందర్ రెడ్డి, మరిపెడ టౌన్ ప్రెసిడెంట్ రాo లాల్, జిల్లా నాయకులు నూకలఅభినయ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, అశోక్ , దేవరశెట్టి కృష్ణమూర్తి, కోమటి వీరన్న, దేవరశెట్టి లక్ష్మీ నారాయణ , దేవరశెట్టి వెంకన్న, బోడ భాస్కర్, పెండం యాకయ్య, దేవరశెట్టి సోమన్న, దేవరశెట్టి కృష్ణ, బుధారపు రామచంద్రం, తుమ్మ ఉప్పలయ్య, తుమ్మ వెంకన్న, బుధారపు శ్రీను, పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు, సంఘం సభ్యులు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

