23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

టైగర్ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. ముంబైలో కలకలం! బాలీవుడ్ నటుడు సురక్షితం.. ఇద్దరికి గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

టైగర్ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. ముంబైలో కలకలం!

 

బాలీవుడ్ నటుడు సురక్షితం.. ఇద్దరికి గాయాలు

ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌ కారుపై కాల్పులు జరిగినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ముంబైలోని జుహు ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు సమాచారం.

 

ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడినట్లు తెలుస్తోంది. అయితే నటుడు టైగర్ ష్రాఫ్‌ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.

 

మరోవైపు, ఈ కాల్పులకు తామే బాధ్యులమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించినట్లు, గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వెలువడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

 

కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.