టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. ముంబైలో కలకలం!
బాలీవుడ్ నటుడు సురక్షితం.. ఇద్దరికి గాయాలు
ముంబై: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ముంబైలోని జుహు ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు సమాచారం.
ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి గాయపడినట్లు తెలుస్తోంది. అయితే నటుడు టైగర్ ష్రాఫ్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
మరోవైపు, ఈ కాల్పులకు తామే బాధ్యులమని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించినట్లు, గ్యాంగ్‌స్టర్ అనిల్ పండిట్ పేరుతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వెలువడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.