23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

రిజిస్ట్రేషన్, స్టాంప్స్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి

Must read

📰 Generate e-Paper Clip

రిజిస్ట్రేషన్, స్టాంప్స్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి

33 మందితో నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక.. మూడేళ్లపాటు కొనసాగనున్న కార్యవర్గం

 

దేశ టైమ్స్ మహబూబాబాద్

మరిపెడ 

 అక్టోబర్ 5: 

 

తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైంది. మూడేళ్ల కాలానికి నిర్వహించిన ఎన్నికల ఫలితాలను ఎన్నికల అధికారి జి. వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటించారు. సంఘం అధ్యక్షుడిగా హరికోట్ల రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అసోసియేట్ అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్, సెక్రటరీగా జి. నరేంద్ర, ట్రెజరర్‌గా వి. సీతారామ్ ఎన్నికయ్యారు. మొత్తం 33 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటైంది. ఇందులో ఏడుగురు ఉపాధ్యక్షులు, ఏడుగురు జాయింట్ సెక్రటరీలు, ఏడుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. అలాగే ఆర్గనైజింగ్, పబ్లిసిటీ, ఆఫీస్, స్పోర్ట్స్ సెక్రటరీలుగా పలువురిని ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంఘం బలోపేతం, అధికారుల సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించింది. నూతన అధ్యక్షుడు హరికోట్ల రవితో పాటు కార్యవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.