23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

బోనకల్ ఎంపీడీవో కార్యాలయంలో వెనుతిరుగుతున్న బాధితులు

Must read

📰 Generate e-Paper Clip

*అధికారుల ‘ఖాళీ కుర్చీ’వాణి!…*

*– సంతకాలు పెట్టి సారుల జంప్!…*

*– ప్రజావాణి హాజరుపై నీలినీడలు.. ప్రజల సమస్యలు వినే నాథుడేడి?…*

*– ఉదయం 10:00 నుండి 1:00 వరకు జరగాల్సిన కార్యక్రమానికి అధికారుల తుర్రు…*

*– బోనకల్ ఎంపీడీవో కార్యాలయంలో వెనుతిరుగుతున్న బాధితులు…*

బోనకల్ సెప్టెంబర్ 28(దేశ టైమ్స్ )

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటికి తక్షణ పరిష్కారం చూపించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజావాణి” కార్యక్రమం బోనకల్ మండలంలో అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి వేదికపై ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు కొలువుదీరాల్సి ఉండగా, కేవలం “ఖాళీ కుర్చీలే” దర్శనమిస్తుండటం గమనార్హం.”సమస్యలు చెప్పుకుందామని ఆశగా వస్తే.. ఇక్కడ ప్రజావాణి లేదు,అధికారులు లేరు! సంతకాలు పెట్టి వెళ్ళిపోతే మా బాధలు వినే నాథుడేడి?”ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించాల్సిన ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొంతమంది అధికారులు ఉదయం 10 గంటలకే ఎంపీడీవో ఆఫీసుకు వచ్చి, అక్కడ ఏర్పాటు చేసిన హాజరు పట్టిక లో సంతకాలు చేసి, పనుల నెపంతో జారుకుంటున్నారు.దూరప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి ఎంపీడీవో కార్యాలయానికి వస్తున్న అర్జీదారులకు అధికారుల ఖాళీ కుర్చీలే స్వాగతం పలుకుతున్నాయి. ప్రజావాణి హాలులోకి వెళ్లి చూస్తే సీట్లలో అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర తీవ్ర నిరాశతో, ఆవేదనతో వెనుతిరుగుతున్నారు.ప్రజావాణికి డుమ్మా కొడుతూ, కేవలం సంతకాలకే పరిమితమవుతున్న బాధ్యతారాహిత్య అధికారులపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజావాణి సక్రమంగా జరిగేలా చూడాలని బోనకల్ మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.