సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1980ల స్టైల్ ఫోటోలు, ఫేస్ మార్ఫింగ్ ట్రెండ్స్ వెనుక సైబర్ మోసాల ప్రమాదం పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
⚠️ అప్రమత్తంగా ఉండండి
అనధికారిక, ఫేక్ యాప్స్‌లో వ్యక్తిగత ఫోటోలు అప్‌లోడ్ చేయొద్దు.
మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం ఉంది.
సోషల్ మీడియా, వాట్సాప్ ఖాతాలకు టూ-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి.
సైబర్ మోసానికి గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించండి.
👉 ట్రెండ్ కోసం ఫోటో పెట్టే ముందు.. మీ వ్యక్తిగత భద్రత గురించి ఆలోచించండి

