సైబర్ నేరగాళ్ల కొత్త మోసం.. 1980 స్టైల్ ఫోటోల ట్రెండ్‌తో ముప్పు!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1980ల స్టైల్ ఫోటోలు, ఫేస్ మార్ఫింగ్ ట్రెండ్స్ వెనుక సైబర్ మోసాల ప్రమాదం పొంచి ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ⚠️ అప్రమత్తంగా ఉండండి అనధికారిక, ఫేక్ యాప్స్‌లో వ్యక్తిగత ఫోటోలు అప్‌లోడ్ చేయొద్దు. మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా, వాట్సాప్ ఖాతాలకు టూ-స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరి. సైబర్ మోసానికి గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించండి. 👉 ట్రెండ్ కోసం ఫోటో పెట్టే ముందు.. మీ వ్యక్తిగత భద్రత గురించి ఆలోచించండి