23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు* *బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు*

Must read

📰 Generate e-Paper Clip

*ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు*

 

*బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు

 

 

*ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాదె రాంబాబు*

 

దేశ టైమ్స్

మహబూబాబాద్

మరిపెడ, సెప్టెంబర్ 17:

 

 

మహబూబాబాద్ జిల్లా

మరిపెడ మున్సిపాలిటీ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాదె రాంబాబు హాజరయ్యారు.

అనంతరం గాదె రాంబాబు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దేశ ప్రజల కోసం మోదీ చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ కార్యకర్తలు, నాయకులు మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.