26.5 C
Hyderabad
Monday, September 14, 2026

నకిలీ బంగారం తాకట్టు పత్రాలతో రూ.59.30 లక్షల మోసం! హనుమకొండలో ఇద్దరు నిందితుల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నకిలీ బంగారం తాకట్టు పత్రాలు సృష్టించి గోల్డ్ ఫైనాన్స్ కంపెనీని రూ.59.30 లక్షలు మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్టయిన వారిలో ఎలిమి సంతోష్ (37), శ్రిమాన్ కో-ఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్, సీఈఓతో పాటు వడ్డేపల్లి రంజిత్ (39) అనే వ్యాపారి ఉన్నారు.

సుమారు 640 గ్రాముల బంగారం తాకట్టు ఉన్నట్లు నకిలీ ప్లెడ్జ్ రసీదు తయారు చేసి, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధిని నమ్మించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బంగారాన్ని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే RTGS ద్వారా రూ.59.30 లక్షలు క్రెడిట్ యూనియన్ ఖాతాకు బదిలీ చేయించినట్లు సమాచారం.

కేసులో నిందితుల మొబైల్ ఫోన్‌లు, నకిలీ ప్లెడ్జ్ కాపీని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఈ మోసంలో మరెవరైనా ఉన్నారా? ఇతర గోల్డ్ ఫైనాన్స్ సంస్థలను కూడా ఇదే తరహాలో మోసం చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ సూచన:

గోల్డ్ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు మరియు ప్రజలు తాకట్టు పత్రాలను మాత్రమే నమ్మకుండా, బంగారం వాస్తవంగా ఉందా లేదా ప్రత్యక్షంగా ధృవీకరించిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలని సూచించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.