గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి
వలిగొండ : సెప్టెంబర్ 8 (దేశ టైమ్స్) గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతి కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ విబి జి రాం జి ఎజండా తొ గ్రామాలలో అభివృద్ధికి
ప్రజ సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గ్రామపంచాయతీ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులతో చర్చించారు.
గ్రామ సభ ద్వారా గ్రామo లోని సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల మెరుగుదల, పారిశుధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేసే అవకాశం కలుగుతుందని అధికారులు సూచించారు.
గ్రామాల అభివృద్ధికి అవసరమైన పనులను ప్రజల సూచనలతొ వారి అవసరాలకు అనుగుణంగా గుర్తించి ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని అధికారులు పేర్కొన్నారు.
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజలు అధికారులతో సమన్వయం నెరవేర్చుకోవాలని అన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో ప్రతి పౌరుడు పాలుపంచుకోవాలని అన్నారు.
అనంతరం స్థానిక తహశీల్దార్ దశరథ సభలో పాల్గొని సర్ ప్రక్రియపై విది విదానాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
సర్ పై ప్రజల్లో ఉన్న పలు అపోహలు, సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్లు, చిరునామా, ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసుకునేందుకు బి ఎల్ ఓ లకు తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ జలంధర్ రెడ్డి, బత్తిని సహదేవ, హోసింగ్ ఎ ఈ కిరణ్, పంచాయతి కార్యదర్శి ఎస్ కే రసూల్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

