*చిన్నారులకు వాడే మందులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్లోర్ ఫెనిరమైన్ మలేట్ అండ్ ఫినైల్ఫైన్ హైడ్రోక్లోరైడ్ కలిగిన అన్ని ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ల తయారీ, అమ్మకం, పంపిణీపై ఆంక్షలు విధించింది.*
అంతేకాదు.. ఈ మందులను నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు వాడొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ ప్రకటనలో.. ఈ ఫార్ములేషన్లకు సంబంధించిన లేబుల్, ప్యాకేజీ ఇన్సర్ట్, ప్రచార ప్రకటనలపై, ‘నాలుగేళ్ల లోపు పిల్లలకు క్లోర్ ఫెనిరమైన్ మలేట్ అండ్ ఫినైల్ఫైన్ హైడ్రోక్లోరైడ్ ఫిక్డ్స్ డోస్ కాంబినేషన్ ఉపయోగించరాదు’ అనే హెచ్చరిక స్పష్టంగా ఉండాలని ప్రభుత్వం ఈ కాంబినేషన్ మెడిసిన్ తయారుచేసే ఫార్మా సంస్థలను ఆదేశించింది.

