26.5 C
Hyderabad
Monday, September 14, 2026

*మయన్మార్‌లో విషాదం.. బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది..!!* 

Must read

📰 Generate e-Paper Clip

  • *మయన్మార్‌లో విషాదం.. బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది..!!*

మయన్మార్‌లో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ సగయింగ్ ప్రాంతంలోని ఒక బౌద్ధ ఆశ్రమంపై సైనిక ప్రభుత్వం జరిపిన వైమానిక దాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 20 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆశ్రమంలో ధ్యాన కార్యక్రమం జరుగుతున్న సమయంలో శుక్రవారం ఈ దాడి జరగడం పెను విషాదాన్ని నింపింది.

 

మ్యౌంగ్‌ టౌన్‌షిప్‌లోని స్వెల్‌ లే ఓ గ్రామంలో ఉన్న బౌద్ధ ఆశ్రమంలో వారం రోజుల ధ్యాన శిబిరం కొనసాగుతోంది. శుక్రవారం భక్తులు ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటున్న సమయంలో సైనిక విమానం ఆశ్రమాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడినట్లు మ్యౌంగ్‌ టౌన్‌షిప్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆర్గనైజేషన్‌ ప్రతినిధి వెల్లడించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.