మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్‌లోకి…
రాజకీయాల్లో కొత్త ఇన్నింగ్స్..
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ మాజీ IAS అధికారి ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది..
జగన్ ప్రభుత్వంలో స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రవీణ్ ప్రకాష్, 2024లో VRS తీసుకుని ప్రభుత్వ సేవలకు వీడ్కోలు పలికారు..
తాజా సమాచారం ప్రకారం 2026 ఆగస్టు 3న వారణాసిలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భవిష్యత్తులో వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది…
అధికార వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి… ఇప్పుడు ప్రజా రాజకీయాల్లోకి రావడం ఆసక్తికర పరిణామం..
అధికారిగా ఉన్న అనుభవం రాజకీయాల్లో ఎంతవరకు ఉపయోగపడుతుంది..?
ప్రవీణ్ ప్రకాష్ కాంగ్రెస్‌కు ఏ మేరకు బలం చేకూరుస్తారు..?
వారణాసి నుంచే ఆయన రాజకీయ భవిష్యత్తుకు శ్రీకారం చుడతారా..?
ఇకపై ఆయన నిర్ణయాలు, రాజకీయ అడుగులు ఆసక్తికరంగా మారనున్నాయి.
అధికార వ్యవస్థ నుంచి రాజకీయ వ్యవస్థలోకి… ప్రవీణ్ ప్రకాష్ కొత్త ప్రయాణం ఎలా సాగుతుందో వేచి చూడాలి..

