26.5 C
Hyderabad
Monday, September 14, 2026

కమ్యూనిస్టులతో మార్పు తథ్యం

Must read

📰 Generate e-Paper Clip

మోడికి ట్రంప్ ఫోబియా

 

-కమ్యూనిస్టులతో మార్పు తథ్యం

 

-ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటాలు

 

– తప్పు చేయకపోతే జంకు ఎందుకు?

 

-సిపిఐ నేత కూనంనేని

 

 

ఖమ్మం ప్రతినిధి ఆగష్టు 13(దేశ టైమ్స్ ):

 

సువిశాల భారతదేశానికి ప్రధాని అయిన నరేంద్రమోడి పిరికివాడిగా మారిపోయాడని, ఆయనకు ట్రంప్ ఫోబియా పట్టుకుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. 145 కోట్ల జనాభా గలిగిన దేశానికి ప్రధానిగా ఉన్న అల్పసంఖ్యాకులైన సంపన్నులు కార్పోరేట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారన్నారు. సిపిఐ జన చైతన్య యాత్రల ముగింపు సందర్భంగా గురువారం ఖమ్మం నగరంలో పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రల అనంతరం ఖమ్మం జడ్పీ సెంటర్ నుంచి పాత బస్టాండ్, మయూరి సెంటర్ మీదుగా భక్తరామదాసు కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాది పార్టీ కార్యకర్తలు, కళాకారుల ప్రదర్శనతో వైరా రోడ్ అరుణావర్ణం పులుముకుంది. భక్తరామదాసు కళాక్షేత్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సాంబశివరావు మాట్లాడుతూ ప్రజలు అనుభవిస్తున్న హక్కులు, సంక్షేమ పథకాలు కమ్యూనిస్టు పోరాట ఫలితంగా వచ్చాయని, ఇప్పుడు దేశంలో మార్పు సైతం, కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమవుతుందని ఇది తథ్యమని అన్నారు. ఎన్నికలు ఆర్థిక వ్యవహరంతో ముడిపడి కోట్లు ఖర్చు చేస్తున్నవారు మాత్రమే విజయం సాధిస్తున్న ఈ రోజుల్లో కమ్యూనిస్టులు సీట్లు గెలవలేకపోవచ్చు కాని, గెలుపు ఓటములను, శాసించే శక్తి కమ్యూనిస్టులకు ఉందని సాంబశివరావు తెలిపారు. మోడి, అమిత్ షాలు తప్పు చేశామన్న భావనతో ఉన్నారని, అందుకే పార్లమెంట్ వచ్చేందుకు జంకుతున్నారన్నారు. మోడికి తిరోగమనం ప్రారంభమైందని, సబ్బండ వర్గాలు మోడి పాలనను వ్యతిరేకిస్తున్నాయన్నారు. ధర్మేంద్రప్రధానే రాజీనామాతో మోడి అహంకారం దిగిపోయిందని, యువత ముఖ్యంగా జెనీ ఉద్యమం దేశవ్యాపితమైందని, బిజెపి అధికారం కోల్పోటమే ఇక మిగిలిందని కూనంనేని తెలిపారు. కమ్యూనిస్టులు ప్రపంచ వ్యాపితంగా పురోగమిస్తున్నారని, అందుకే అక్కడ ట్రంప్, ఇక్కడ మోడి బయటపడుతున్నారన్నారు. దేశాన్ని దోచుకుంటూ సంపదను, కార్పోరేట్లకు కట్టబెడుతున్న బిజెపి సర్కార్, ఇప్పుడు అయోధ్య రాముని సోమ్ముకు ఎసరు పెట్టిందని, బిజెపి దాని అనుబంధ సంస్థలు, దొంగల దండుల దేశంపై పడ్డారని, చీమల దండులా కదిలి దొంగల దండును తరిమి వేయాలని సాంబశివరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారని, అయినా ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రశ్శిస్తూనే ఉంటామని కూనంనేని తెలిపారు. గెలుపు ఓటములు ఎన్నికల వరకే పరిమితమని, ఒకటి రెండు సీట్ల కోసం ప్రజా సమస్యల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో ఈ సారి పోటీ తథ్యమన్నారు.

 

-హామీల అమలుకు పోరాటం

-బాగం

 

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను, అమలు చేయడంలో తాత్సారం ప్రదర్శిస్తుందని, హామీలను విస్మరిస్తే ఆందోళన తప్పదని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. సన్నబియ్యం, ఉచిత బస్సు మినహా మిగిలిన హామీలలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. సిపిఐ ప్రజాచైతన్య యాత్రతో హేమంతరావు మాట్లాడుతూ అప్పుల పేరుతో హామీలను అమలు చేయకపోతే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. బిఆర్ఎస్ డబుల్ బెడ్రూం ఇండ్ల మాదిరే కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో రాజకీయ వివక్ష పాటిస్తుందని, జెండా కప్పుకుంటునే ఇండ్లు కేటాయిస్తామనటం సరికాదు. సీతారామ ప్రాజెక్టును ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తేలియచేయాలని హేమంతరావు డిమాండ్ చేశారు. మోడి ప్రజా వ్యతిరేక విధానాల పైనా, రాష్ట్రంలో హామీల అమలు కోసం నిరంతర పోరాటం కొనసాగుతుందని హేమంతరావు స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమీషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా తదితరులు ప్రసంగించగా, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సభలో సిపిఐ నగర కార్యదర్శి షేక్ జానీమియా, రాష్ట్ర సమితి సభ్యులు ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, మహ్మద్ సలాం, బిజి క్లైమెంట్, అజ్మీరా రామమూర్తి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి, కళాకారులు సతీష్ బృందం అలపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.