*_IND vs WI 3rd T20I: టాస్ ఓడిన భారత్.. సిరీస్‌లో ఆధిక్యం ఎవరిదయ్యోనో.._*
_ndia vs West Indies, 3rd T20I: భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ నేడు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది._
_దీంతో విండీస్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్ లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి._
_గత రెండు మ్యాచ్‌లలో 72.2 ఓవర్ల ఆట జరగగా, మొత్తం 844 పరుగులు నమోదయ్యాయి. అందువల్ల, ఇండోర్‌లో అధిక స్కోర్లు నమోదవుతాయని అంచనా. 2017లో ఇదే మైదానంలో శ్రీలంకతో జరిగిన టీ20ఐలో భారత్ 260 పరుగులు చేసింది. తొలి టీ20లో వెస్టిండీస్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని భారత్ 14.4 ఓవర్లలో ఛేదించగా, రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ 250 పరుగుల లక్ష్యాన్ని తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే సాధించింది._
*_భారత్, వెస్టిండీస్ మధ్య 33 టీ20 మ్యాచ్‌లు.._*
_భారత్, వెస్టిండీస్ ఇప్పటివరకు 33 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో భారత్ 21 మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ 11 మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది._
*_బ్యాటర్లకు అనుకూలమైన పిచ్.._*
_ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైన వేదికగా పరిగణిస్తున్నారు. ఇక్కడి చిన్న బౌండరీల వల్ల ఫోర్లు, సిక్సర్లు కొట్టడం సులభం. గత మూడు వన్డేలలో ఇక్కడ 399, 385, 337 స్కోర్లు నమోదయ్యాయి._

