23.5 C
Hyderabad
Sunday, October 25, 2026

ఆస్తి కోసం పక్షవాతంతో మంచానికే పరిమితమైన తల్లిపైనా దాడి?

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, సెప్టెంబర్ 27: ఆస్తి వివాదం నేపథ్యంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన తన తల్లిపై కూడా దాడులు జరిగాయని కూకట్‌పల్లి ఆల్విన్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి టి. నాగార్జున ఆరోపించారు. తన అన్న, వదిన, ఆమె సోదరుడి నుంచి గత నాలుగేళ్లుగా వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు.

తనపై, తన తల్లిపై పలుమార్లు భౌతిక దాడులు జరిగాయని, కొన్ని ఘటనలు ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని నాగార్జున పేర్కొన్నారు. దాడుల కారణంగా గాయాలయ్యాయని, అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.

ఈ ఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదని ఆయన ఆరోపించారు. తమకు న్యాయం చేయడంతో పాటు, వృద్ధురాలైన తన తల్లికి రక్షణ కల్పించాలని నాగార్జున పోలీసులను కోరారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.