26.5 C
Hyderabad
Monday, September 14, 2026

బెంగళూరులో జరిగిన ఈ ఘోరమైన జంట హత్యల కేసు దేశవ్యాప్తం గా తీవ్ర సంచలనం సృష్టించింది*.

Must read

📰 Generate e-Paper Clip

*బెంగళూరులో జరిగిన ఈ ఘోరమైన జంట హత్యల కేసు దేశవ్యాప్తం గా తీవ్ర సంచలనం సృష్టించింది*.

 

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో హరిణి అనే మహిళ, తన ప్రియుడు వినయ్‌తో కలిసి భర్త అభినందన్‌ను, అలాగే ఈ నేరాన్ని కళ్లారా చూశాడనే కోపంతో కన్న కొడుకు యదువీర్‌ను అతి కిరాతకంగా చంపేసింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన అభినందన్‌కు, హరిణికి 2021 లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు యదువీర్ ఉన్నాడు. అయితే 2024 లో హరిణికి స్నాప్‌చాట్ ద్వారా వినయ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త అభినందన్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. భర్త తన కాల్ డేటాను సేకరిస్తున్నాడని, తన ప్రేమకు అడ్డుపడు తున్నాడని హరిణి భావించింది అభినందన్‌ కు బెంగళూరు లోని చిక్కబాణవార ప్రాంతంలో కోట్ల విలువైన మూడు అంతస్తుల ఇల్లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. అతడిని చంపేస్తే ఆ ఆస్తి మొత్తం తమకే దక్కుతుందని హరిణి, వినయ్ ప్లాన్ వేశారు. ఆగస్టు 16, ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగి ఇద్దరూ వేర్వేరు గదుల్లో పడుకున్నారు. ఇదే అదునుగా భావించిన హరిణి, ఇంటి సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి ప్రియుడు వినయ్‌ను ఇంటికి పిలిపించింది. అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న అభినందన్‌పై దాడి చేసి, ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేశారు ఆ సమయంలో శబ్దాలు రావడంతో నాలుగేళ్ల కుమారుడు యదువీర్ నిద్రలేచాడు. తండ్రిని చంపడం చిన్నారి కళ్లారా చూడటంతో, ఎక్కడ తమ బండారం బయటపడుతుందోనని భయపడి, కన్న కొడుకు అని కూడా చూడకుండా దిండుతో ముఖాన్ని నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసింది. హత్య జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న రక్తపు మరకలను తుడిచేసి, బట్టలను ఉతికి సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించారు. సోమవారం ఉదయం ఏమీ తెలియనట్లు హరిణే స్వయంగా పోలీసుల హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి, తన భర్త, కొడుకు నిద్రలోనే స్పందించడం లేదంటూ నాటకమాడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించగా, అభినందన్ శరీరంపై గాయాలు, ఇద్దరి చెవుల నుండి రక్తం రావడం గమనించి అనుమానించారు. హరిణి మొబైల్ ఫోన్‌లోని కాల్ హిస్టరీ, మెసేజ్‌లు డిలీట్ చేసి ఉండటం, ఆమె చెబుతున్న సమాధానాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దాంతో తానే ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు హరిణి ఒప్పుకుంది. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు హరిణిని, ఆమె ప్రియుడు వినయ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.