26.5 C
Hyderabad
Monday, September 14, 2026

హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం*

Must read

📰 Generate e-Paper Clip

 

*హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం*

హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు

సమావేశంలో ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించిన సీఎం చంద్రబాబు 

దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యమని వెల్లడి 

కేంద్రం–రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని సీఎం సూచన

 ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు ప్రతిపాదన

కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ నడపాలని ప్రతిపాదించిన సీఎం

 అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని స్పష్టం 

దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలని సూచన

దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలనీ సూచన

దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని స్పష్టం 

విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించిన సీఎం 

తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరిన ముఖ్యమంత్రి 

దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందన్న సీఎం

2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని వెల్లడి 

వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలనీ ప్రసంగంలో పేర్కొన్న సీఎం

విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదనీ వెల్లడించిన ముఖ్యమంత్రి 

విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలనీ కేంద్రాన్ని కోరిన సీఎం

పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నట్టు స్పష్టం 

అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించాం అన్న సీఎం

వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలనీ కోరిన సీఎం

దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి 

విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని కోరిన సీఎం 

కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు కేంద్ర అనుమతులు ఇవ్వాలి

గోదావరి–కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన

గోదావరి–కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అని వ్యాఖ్య

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కలిసి నదీ జలాలపై సమన్వయంతో ముందుకు సాగాలి

గంగా–కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరం

నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి 

సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం అన్న సీఎం

31వ సదరన్ జోనల్ కౌన్సిల్ విజయవంతం కావాలని ఆకాంక్షించిన సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాన్ని కొనియాడిన దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు

దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధి గురించి ఎంతో విజన్ తో మాట్లాడారన్న సీఎం లు

సీనియర్ నాయకుడిగా విశాల దృక్పథంతో అన్ని రాష్ట్రాల అభివృద్ధి గురించి మాట్లాడారని ప్రశంసించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.