32.1 C
Hyderabad
Tuesday, September 15, 2026

గిరిపురంలో రోడ్డు ప్రమాదం.. సర్పంచ్ మృతి*

Must read

📰 Generate e-Paper Clip

 

 

(దేశ టైమ్స్)

మహబూబాబాద్/మరిపెడ ఆగస్టు 17

 

 

రోడ్డు ప్రమాదంలో గ్రామ సర్పంచ్ మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకంపాడు గ్రామ సర్పంచ్ సోమన్న సోమవారం రాత్రి 8 గంటలకు సమయం లో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గిరిపురం ముత్యాలమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొట్టింది.

 

ఈ ప్రమాదంలో సోమన్న తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. సర్పంచ్ సోమన్న మృతితో వెంకంపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

 

ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.