26.5 C
Hyderabad
Monday, September 14, 2026

🚨 ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Must read

📰 Generate e-Paper Clip

🚨 ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బుర్రవాగు స్టేజి సమీపంలో జాతీయ రహదారి 44పై మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. వంతెన నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుడిని కారు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

అనంతరం కారు అదుపుతప్పి వంతెనపై నుంచి బోల్తా పడింది. మృతుడు బీహార్‌కు చెందిన కార్మికుడిగా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.