26.5 C
Hyderabad
Monday, September 14, 2026

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు

Must read

📰 Generate e-Paper Clip

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు పిల్లలు

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ (38), ఆయన భార్య మేఘన (34) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 

కొన్ని నెలల క్రితం సొంత ఇల్లు కొనుగోలు చేసేందుకు దంపతులు సుమారు రూ.90 లక్షలు అప్పు చేసినట్లు సమాచారం. ఇంటిపై రుణం వస్తుందని భావించినప్పటికీ రుణం రాకపోవడంతో, కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిని అమ్మి కొంత అప్పు తీర్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ మిగిలిన అప్పులపై నరేష్ తీవ్ర ఆందోళనకు గురైనట్లు బంధువులు తెలిపారు.

 

పిల్లలు అయాన్ష్ (9), మిథున్ (7) స్కూల్‌కు వెళ్లిన సమయంలో నరేష్ ఉరేసుకుని, మేఘన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

 

దంపతుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మేఘన తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article

App Icon

Install DT News App

Add to home screen for faster loading and latest updates.